పీరియడ్స్ టైంలో నొప్పులను తగ్గించటానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..అప్పుడే కాదు.ఎప్పుడూ పెయిన్స్ రావట.!

-

పీరియడ్స్ నొప్పులు అంటే..ప్రెగ్నెన్సీ నొప్పలుతో సమానమే..అవి అయినా..జీవితంలో రెండుమూడు సార్లు మాత్రమే వస్తాయి. కానీ ఈ పీరియడ్స్ నొప్పులు నెల నెలా వచ్చి ఆడవారిని తెగ ఇబ్బంది పెడతాయి. పాపం బాధను భరించలేక ఏడుస్తారు. ఏ పని చేయలేరు. అయితే ఈ పరిస్థితి అందరిలో ఉండదు. కొందరు మాత్రమే పీరియడ్స్ పెయిన్స్ ను భరించలేరు. పొత్తికడపు అంతా బిగబట్టినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వాడతారు.

పెయిన్స్ రావడానికి ఉండే కారణాలు:

కొంతమందిలో కొన్ని కారణాల చేత ఇస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చూయేట్ అవుతుంది. ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటాయి. శరీరంలో రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయిన వెంటనే వాటిగుణం ఏంటంటే..రక్తనాళాలు ముడుచుకోవడం, మజిల్స్ బాగా కన్స్టట్రిక్ అవుతాయి. ఇది మెయిన్ గా పెయిన్ రావడానికి కారణం.
కొంతమందికి నూట్రస్ లో ఎండోమెంట్రియాసిస్ ఉంటాయి. దాని వల్ల కూడా పెయిన్ వస్తుంది.
ఇంకొంతమందికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. దానివల్ల కూడా పెయిన్ వస్తుంది.
మరికొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ లో గడ్డలు ఉంటాయి. దానివల్ల కూడా నొప్పి వస్తుంది.

ఈ సమయంలో నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటారు. టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..కానీ ఎప్పుడో వచ్చే సైడ్ ఎఫెక్ట్స సంగతి దేవుడెరుగు..ముందు ఈ నొప్పిపోతే చాలు అనుకుంటారు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది పెయిన్. కానీ ప్రకృతి విధానంలో ఈ నొప్పిని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి..అవేంటంటే.

నాచురల్గా నొప్పిని తగ్గించుకునే మార్గాలు:

పెయిన్ కిల్లర్ లాగా రిలీఫ్ ను ఇచ్చేవి రెండు రకాలు ఉన్నాయి..ఆవనూనెలో కర్పూరం వేసి పొత్తికడుపు భాగం మీద 5-10నిమిషాలు మెల్లగా రాసుకుని..వేడినీళ్లతో కాప‍డం పెట్టుకోండి.

యూకలిప్టస్ ఆయిల్ ఉంటే..అందులోఈ కర్పూరం వేస్తే..నాచురల్ పెయిన్ కిల్లర్ గా పనికొస్తాయి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నొప్పితగ్గుతుంది. ఒకసారి ఆ‌వనూనె, ఒకసారి యూకలిప్టస్ ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు.

ఈ వేడికాపడం పెట్టేసరికి..ఈ మజిల్ క్రామ్స్ తగ్గుతాయి. కన్సిస్టట్ అయిన మజిల్ కి వేడిపెట్టేసరికి వ్యాకోచించి పెయిన్ తగ్గుతుంది.

పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం మంచిదికాదు..దీర్ఘకాలికంగా వాడటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి.

దాల్చిన చెక్క, అల్లం,సోంపు నీళ్లులో వేసి మరగించి..ఫిల్టర్ చేసి..తేనె, నిమ్మరసం వేసుకుని చక్కగా కాఫీ తాగినట్లు తాగితే లోపల నుంచి వచ్చే నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పిని తగ్గిస్తుందని సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది.

పీరియడ్స్ సమయంలో తినకూడనవి, తాగకూడనవి ఇవే :

చాలామంది ఈ నొప్పివచ్చే సమయంలో తాగకూడనిది ఒకటి తాగుతారు..అదే కాఫీ. అప్పటికే పొత్తికడుపులో చిరాకుగా ఉంటుంది. ఆ మెంటల్ ఇరిటేషన్ పోవాలని కాఫీ తాగేస్తుంటారు. కాఫీలు తాగితే తలనొప్పి తగ్గుతుంది కానీ..కడుపునొప్పి ఎక్కువై పోతుంది. ఎందుకు ఎక్కువవుతుంది అంటే..ఈ కాఫీలో ఉండే కెఫీన్ వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ ను ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇవి పెరిగితే క్రామ్స్ పెరుగుతాయి. ఇక మెలితిప్పినట్లు నొప్పి పెరుగుతుంది. అందుకని అసలు పిరియడ్స్ టైంలో కాఫీలు ఎక్కువ తాగకూడదు. కెఫిన్ ఎక్కువగా ఉండే..చాక్లెట్స్, కూల్ డ్రింగ్స్ కూడా తాగకూడదు. నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తినకూడదు. ఇవన్నీ హెవీ ఫుడ్స్. డైజెషన్ త్వరగా అవ్వవు.

ఈ టైంలో ఉప్పు ఎక్కువ తిన్నా నొప్పి ఎక్కువ అవుతుంది. వీలైతే ఈ సమయంలో సాల్ట్ కంప్లీట్ గా ఎవైడ్ చేయడం మంచిది.

ఉపశమనం రావాలంటే..ఉదయం, సాయంకాలం పండ్లు, హై ఫైబర్ ఉండే కూరలు తినాలి..లో ఫ్యాట్ డైట్ తింటే..బాగా రిలీఫ్ ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.

అసలు ఈ పీరియడ్స్ స్క్రామ్స్ అనేవి రాకుండా ఉండాలంటే..జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటే..

సంతోషంగా ఉండేవారికి అసలు ఇలాంటి నొప్పులు రావట. ఎప్పుడు చిరాకుగా, టెన్షన్ గా ఉండేవారికి నొప్పులు ఎక్కువగా వస్తాయట. మన మెదడులో రెండు హార్మోన్ బాగా రిలీజ్ అ‌వుతాయి. వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. అవే..డొపమైన్, ఫెరటోనిన్. ఇవి రెండూ రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో కూడా ఎండార్ఫిన్స్ అనేవి కూడా ఎక్కువగా రిలీజ్ అ‌వుతాయి. ఇవి పెయిన్ కిల్లర్ లాగా రిలీజ్ అయ్యే హార్మోన్స్. అంటే సంతోషాన్ని కలిగించే హార్మోన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు..ఈ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అ‌వుతుంది. ఇది నొప్పులను తగ్గిస్తుంది. అంటే మనం ఎంత సంతోషంగా ఉంటే..అంత మంచిది. మనసులో సంతోషంగా ఉంటే..ఆ హ్యాపీనెస్ కళ్లలో కనిపిస్తుంది. ముఖం మొత్తం భలే వెలిగిపోతుంది.

విటమిన్ D, E, B1, B6, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఇ‌వి బాగా అందితే..అసలు పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజన్ ఫ్లక్చువేట్స్ రావు..నొప్పులు రావు. ఈ విటమిన్లు ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది..మరి ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయంటే..

విటమిన్ E పొద్దుతిరుగుడు పప్పులో బాగా ఉంటుంది. అందుకని నానపెట్టుకుని డైలీ తింటే చాలు..బాదంపప్పులో కూడా ఉంటుంది
ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ బాగా ఉండేవి..అవిసె గింజలు. వీటితో కారంపోడి కొట్టుకుని వాడుకోవడం, పొడిచేసి కూరల్లో వాడుకోవటం చేస్తుండాలి.

అల్లంలో జింజురాల్ అనే కెమికల్స్ ఉంటాయి. పిరియడ్స్ టైంలో 4-5 గ్రాముల అల్లం తీసుకుంటే..ఆ మజిల్ రిలాక్షేషన్ కి బాగా ఉపయోగపడతాయి.

ఐస్ ప్యాక్ పెట్టుకున్నా నొప్పి తగ్గుతుంది.

నొప్పితగ్గాలంటే..మోషన్ బాగా అవ్వాలి. గ్యాస్ బాగా రిలీజ్ అవ్వాలి. ఇలాంటి సమయంలో నీళ్లుబాగా తాగాలి.

హై ఫైబర్ లో ఫ్యాట్ ఉండేవి తినాలి..కానీ మనం జీరో ఫైబర్..హై ఫ్యాట్ ఉండే ఆహారాలు తింటాం. మన అలవాట్లు మార్చుకోవడం మనచేతుల్లో ఉంది కాబట్టి ఈ సమస్యలను తగ్గించుకోవడం కూడా పెద్ద టాస్క్ ఏం కాదు..కానీ చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాట్లు అన్నీ చేస్తూ..ఈ జన్మఎత్తినందుకు ఇక ఈ నొప్పులు భరించక తప్పదు అనుకుంటారు. ఈ టిప్స్ ఫాలో అయితే ఈ నొప్పులు లేకుండా హ్యాపీగా ఆ నాలుగురోజులు పీరియడ్స్ ను కంప్లీట్ చేయొచ్చు.

పిరియడ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే:

అవగాహన లేక..తినకూడని ఆహారాలు తింటుంటారు. అసలే పిరియడ్స్ అయినప్పుడు చాలా బ్లెడ్ పోతుంది. మళ్లీ శరీరానికి రక్తం పట్టాలంటే..కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే..ఆకుకూరలు. పండ్లు, కూరగాయలు కంటే కూడా..త్వరగా రక్తాన్ని ఇవ్వడానికి ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. తేలికగా డైజేషన్ అవుతూ..చక్కగా అరిగిస్తూ..రక్తం త్వరగా పట్టేట్లు చేస్తాయి. పిరియడ్స్ అయిపోయిన తర్వాత ఆకుకూరలు బాగా తినాలి.
మన బాడీకీ 30మిల్లీగ్రాముల ఐరన్ ఒకరోజుకు కావాలి. తోటకూర, తోటకూరకాడలతో అలా వండేసుకుంటే..దాదాపు39 మిల్లీగ్రాముల వరకూ ఐరన్ వస్తుంది.

కాలిఫ్లవర్ కాడల్లో 40మిల్లీగ్రాముల వరకూ ఉంటుంది. ఈ రెండూ ఎక్కవగా వాడుకోవాలి.

స్త్రీలల్లో హిమోగ్లోబిన్ అనేది 12-14 గ్రాములు ఉండాల్సింది..చాలామందికి 10-11 గ్రాములే ఉంటుంది. కొంతమందికి అధికబ్లీడింగ్ వల్ల 8-9లోనే ఉంటుంది. మరి అలాంటి సమస్య నెక్స్ట్ సైకిల్ వచ్చేవరకూ ఉంటే..పనిచేసుకోలేరు. నీరసించుపోతారు. రక్తహీనత భారిన పడతారు.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తింటే చాలు.

రుతుక్రమంలో ఉన్నప్పుడు గర్భసంచి కూడా చాలా ప్రజర్ కు లోనవుతున్నట్లు ఉంటుంది. మరి ఈ నాలుగురోజులు తర్వాత గర్భాశయం యథావిథిగా రావాలంటే కొన్ని ఆహారాలు తినాలి. గర్భశయంలోపల పొరలు రప్చర్ అయి..బ్లీడింగ్ ద్వారా బయటకువెళ్లిపోతాయి. మళ్లీ నెక్ట్స్ మంథ్ ఎగ్స్ రిలీజ్ అయ్యే సమయానికి మళ్లీ ఆ బ్లడ్ అంతా తయారవ్వాలి. ఈ రిప్లేస్ అయిన సెల్స్ అన్నింటిని హీల్ చేసి..కొత్త లేయర్స్ ని ఉత్పత్తి చేయడానికి రిపేర్ చేయడానికి, అంతా క్లీన్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ రాకుండా..నయం చేసుకోవడానికి విటమిన్ C ఎక్కువగా కావాలి. అందుకని పిరియడ్స్ అయిన తర్వాతా కమలారసం, బత్తాయి రసం ఎక్కువగా తీసుకోవటం ఉత్తమం. సాయంకాలం ఆహారంలో కొన్నిరోజులపాటు పండ్లు తీసుకుంటే మరీ మంచిది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version