గుంటూరు, విశాఖపట్నం, తిరుమల, తిరుపతి, కర్నూలులో రాష్ట్రస్థాయి ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెలరోజులలో తిరుమల, విశాఖపట్నంలో టెస్టింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు దాదాపు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా… ఏపీలో త్వరలోనే విద్యుత్ సంస్థలలో ఉద్యోగుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఏపీలోని విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని అన్నారు. దీంతో ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో నిన్నటి నుంచి మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో మహిళలు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.