ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఉచిత బస్సు నేపథ్యంలో తిరుమలకు వెళ్లాలనుకునే మహిళలకు నిరాశ మిగిలింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఏ బస్సులో కూడా మహిళలకు ఫ్రీ టికెట్ పథకం వర్తించ బోధనీ తాజాగా తిరుమల డిపో అధికారులు ప్రకటన చేశారు. తిరుమల కొండపైకి వెళ్లాలంటే కచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాలని వెల్లడించారు అధికారులు.

కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో ఏపీ మహిళలు నిరాశ చెందుతున్నారు. కాగా.. ఆగస్టు 15వ తేదీన అంటే రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చాలా అట్టహాసంగా ప్రారంభించారు. విజయవాడలో.. మహిళలకు ప్రత్యేక టికెట్ కొట్టి మరీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.