బి గ్రూప్ రక్తం ఉన్నవారు మొక్కజొన్న, గోధుమ, పప్పు దినుసులు, టమాటాలు, పల్లీలు, నువ్వులు, చికెన్ తక్కువగా తినాలి.
ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో రకమైన గ్రూప్‌నకు చెందిన రక్తం ఉంటుంది. కొందరికి ఎ గ్రూప్ రక్తం ఉంటే కొందరికి బి గ్రూప్, ఇంకా కొందరికి ఓ గ్రూప్, మరికొందరికి ఏబీ గ్రూప్ రక్తాలు ఉంటాయి. ఈ క్రమంలో వీటిలో మళ్లీ పాజిటివ్, నెగెటివ్ అని కూడా రకాలు ఉంటాయి. అయితే ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు అయినా సరే.. రక్తహీనత సమస్య రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ క్రమంలోనే ఏ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎలాంటి ఆహారాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒ గ్రూప్
ఒ గ్రూప్ రక్తం ఉన్న వారిలో జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. దీంతో వీరికి అజీర్తి, థైరాయిడ్ సమస్యలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక వీరు ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, చేపలు, కూరగాయలు, పప్పులు, బీన్స్, పాల ఉత్పత్తులు తదితర ఆహారాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది.
2. ఎ గ్రూప్
ఈ రకం రక్తం ఉన్నవారిలో శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే వీరు డయాబెటిస్, అధిక బరువు సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కనుక ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుడు, శనగలు, తృణ ధాన్యాలు తినాల్సి ఉంటుంది.
3. బి గ్రూప్
బి గ్రూప్ రక్తం ఉన్నవారు మొక్కజొన్న, గోధుమ, పప్పు దినుసులు, టమాటాలు, పల్లీలు, నువ్వులు, చికెన్ తక్కువగా తినాలి. ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, గుడ్లు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వీరిలో సహజంగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు డయాబెటిస్, అధిక బరువు సమస్యలతో బాధపడే అవకాశం ఉంది.
4. ఏబీ గ్రూప్
ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు సోయాతో చేసిన తోఫు, సీ ఫుడ్, పాల ఉత్పత్తులు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. అలాగే కాఫీ, ఆల్కహాల్, మాంసం తినరాదు. లేదా తక్కువగా తీసుకోవాలి. వీరికి జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.