ఫుల్‌బాల్‌ లెజెండ్ డీగో మారడోనా మృతి..శోకసంద్రంలో అభిమానులు.

-

.000001గ్రేట్‌ ఫుల్‌బాల్‌ ప్లేయర్‌ డీగో మారడోనా కన్నుమూశారు..అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన.. ఆ0స్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపై ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు శోకసంద్రంలోకి మునిగిపోయారు..తన ఆటతో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడేలా చేసుకున్నాడు మారడోనా. ఫుట్‌బాల్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌గా నిలిచాడు. 60ఏళ్లు పూర్తి చేసుకుని నెల రోజులు కూడా తిరక్కుండానే మారడోనా కన్నుమూయడంతో ఆయన అభిమానులు ఆవేదనలో మునిగిపోయారు. వియ్‌ మిస్‌ యూ అంటూ నివాళులు అర్పిస్తున్నారు.

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా కన్నుమూశారు. కోట్లాది క్రీడాభిమానుల్ని శోకసంద్రంలో ముంచుతూ..తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయనకు విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు డాక్టర్లు. అయితే గత సోమవారం అనీమియా, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన మారడోనాకు అతి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డాక్టర్లు స్పందించేలోపే ప్రాణాలు కోల్పోయారు మారడోనా.1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా1986లో తన దేశానికి ఫిఫా వరల్డ్‌ కప్‌ అందించారు. మొత్తం నాలుగు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ పోటీల్లో పాల్గొన్న ఆయన 1990లోనూ అర్జెంటీనాను ఫైనల్‌ దాకా తీసుకెళ్లారు. అప్పటిదాకా ఫుల్‌ జోష్‌లో సాగిన మారడోనా కెరీర్‌ 1991లో డోపింగ్‌ టెస్టుల్లో పట్టుబడటంతో ఒడిదొడుకులకు లోనైంది. ఏకంగా 15 నెలల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు మారడోనా. ఆ తర్వాత 1994 ప్రపంచకప్‌ పోటీల్లో ఆడినా నాకౌట్‌ దశలోనే అర్జెంటీనా ఇంటిదారి పట్టడంతోమారడోనా కెరీర్‌ చరమాంకానికి చేరుకుంది. చివరికి 1997లో ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌కు రిటర్మెంట్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news