అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్..ఐదు డివిజన్లలో ఎవరి సత్తా ఎంతంటే

-

జిహెచ్ఎంసి ఎన్నికల్లో అంబర్ పేట నియెజకవర్గంలోని డివిజన్ లలో పాగా వేసేది ఏవరు.. గతంలో అని డివిజన్ లు కైవసం చేసుకున్న టిఆర్ఎస్ …ఈ సారి కూడా అన్నీ దక్కించుకుంటుందా లేక బిజేపి ,కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరుస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.అంబర్ పేట నియెజకవర్గంలోని అయిదు డివిజన్ లలో ఉన్న ప్రధాన సమస్యలు,ఏ డివిజన్లో ఎవరి సత్తా ఎంతంటే…

గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న నియెజకవర్గం అంబర్ పేట .హిమయత్ నగర్ నియెజకవర్గం రద్దు అయిన తర్వాత కొత్తగా అంబర్ పేట నియెజకవర్గం ఏర్పాటు అయ్యింది. 2018ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ అంబర్ పేట నియెజకవర్గం ను కైవసం చేసుకుంది .కాలేరు వెంకటేష్ అంబర్ పేట నియెజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .ఇటు నియెజకవర్గ పరిధిలో కాచిగూడ,నల్లకుంట,అంబర్ పేట,గోల్నాక,బాగ్ అంబర్ పేట డివిజన్ లు ఉన్నాయి.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ కార్పోరేటర్ లలో ముగ్గురికి టిక్కెట్ దక్కలేదు .

అంబర్ పేట అసెంబ్లీ నియెజకవర్గంలో ముదిరాజ్ ,గంగ పుత్రులు,పద్మశాలి,గౌడ్ ,ఎస్సీలు,మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు .కాచిగూడ డివిజన్ లో యాదవులు ,మార్వడి ,గుజరాతీలతో పాటు ఇతర రాష్ట్రాలు వారు ఎక్కువగా ఉన్నారు .నల్లకుంట డివిజన్ లో బ్రహ్మణులు,ఎస్సీలు,రెడ్డి సామాజిక ,గంగపుత్రులతో పాటు బిసి కులాల ఓటర్లు ఉన్నారు .బాగ్ అంబర్ పేట డివిజన్ లో రెడ్డిలు,గౌడ్ ,ముదిరాజ్ ,ఎస్సీ ఓటర్లు ఉన్నారు .గోల్నాక డివిజన్ లో గంగపుత్రులు ,మైనార్టీలు ,పద్మశాలి,ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ పార్టీల లెక్కలు .అంబర్ పేట మైనార్టీ,పద్మశాలీలు,గంగపుత్రులు ,ముదిరాజ్ తో పాటు ఇతర బిసి కులాల ఓటర్లు ఉన్నట్టు అంచనా .

2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అంబర్ పేట అసెంబ్లీ నియెజకవర్గ పరిధిలో ఉన్న 5 డివిజన్ లను కైవసం చేసుకుంది .ఈ సారి నియెజకవర్గ పరిధిలో 5 డివిజన్ లలో ముగ్గురు సిట్టింగ్ కార్పోరేటర్ లకు టిక్కెట్లు దక్కలేదు .ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న టిఆర్ఎస్ …అక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చింది .గతంలో 5 డివిజన్ లను కైవసం చేసుకున్నామన్న ధీమాతో ఉన్నటిఆర్ఎస్ …ఈ సారి కూడా మళ్లీ అన్ని డివిజన్ లను దక్కించుకోవాలనుకుంటుంది .

అంబర్ పేట నియెజకవర్గంలోని అయిదు డివిజన్ లలో అభ్యర్ధులను బరిలోకి దింపింది కమలం పార్టీ .అన్ని డివిజన్ లను గెలుచుకునేందుకు కమలం పార్టీ ప్రణాళికలో ముందుకు వెళ్తోంది . 2018అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది .2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న అని డివిజన్లలో ఓటమి పాలయ్యింది .ఈ సారి అన్ని డివిజన్ లలో అభ్యర్ధులను బరిలోకి దింపింది కాంగ్రెస్ .అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నియెజకవర్గంలో పార్టీని నడిపే వారు లేని పరిస్థితి.

నల్లకుంట డివిజన్ లో సిట్టింగ్ కార్పోరేటర్ గరిగంటి శ్రీదేవికి టిఆర్ఎస్ పార్టీ మరోసారి పోటి చేసే అవకాశం ఇచ్చింది .ఈ డివిజన్ లోని తిలక్ నగర్ రత్న నగర్ లో రిటర్నింగ్ వాల్ సమస్య ఉంది .భారీ వర్షాలు వస్తే కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు . బాగ్ అంబర్ పేట డివిజన్ లో ప్రస్తుత సిట్టింగ్ కార్పేరేటర్ పద్మావతి డిపి రెడ్డి కే మరోసారి టిఆర్ఎస్ పోటి చేసే అవకాశం ఇచ్చింది .ఈ డివిజన్ లో ప్రధానంగా కలుషిత నీరు ,డ్రైనేజ్ సమస్యను ప్రధానంగా స్థానికలు లేవనెత్తుతున్నారు .

గోల్నాక డివిజన్ సిట్టింగ్ కార్పోరేటర్ కాలేరు పద్మకు టిక్కెట్లు కేటాయించలేదు టిఆర్ఎస్.ఈ డివిజన్ నుంచి దూసరి లావణ్య గౌడ్ కు టిఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. స్థానికేతరులకు టిక్కెట్ కేటాయించరన్న అసంతృప్తి డివిజన్ లోని గులాబి పార్టీలోని ఒక వర్గం వినిపిస్తోందన్న వాదనలు ఉన్నాయి. కాచిగూడ డివిజన్ సిట్టింగ్ కార్పోరేటర్ కి టిక్కెట్ నిరాకరించింది టిఆర్ఎస్ .ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇచ్చింది గులాబీ పార్టీ .ఈ డివిజన్ లో నీటి సమస్యను ప్రస్తావిస్తున్నారు స్థానికలు .నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

అంబర్ పేట డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పోరేటర్ పులి జగన్ కు టిక్కెట్ నిరాకరించి…కొత్తగా విజయ్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చింది .అంబర్ పేట డివిజన్ లో ప్రధాన సమస్య కలుషిత నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు .పటేల్ నగర్ ,సాయి నగర్ లో కలుషిత నీరుతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు .ఈ సమస్యను పరిష్కారించాలని స్థానికలు డిమాండ్ చేస్తున్నారు .

ప్రధాన రాజకీయ పార్టీలు అంబర్ పేట నియెజకవర్గంలోని డివిజన్ లలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.మరి ప్రజలు ఏటువైపు మొగ్గుచూపుతారో చూడాల్సిందే .

Read more RELATED
Recommended to you

Latest news