పిల్లల మేధోశక్తికి.. యాపిల్ డేట్స్ సలాడ్.. సింపుల్ గా ఇలా చేసేద్దామా..!

-

పిల్లలకు ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్లు తినడం లేదుగా అని మనం పెట్టకపోతే.. ఎదిగే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. వాళ్లు ఎప్పుడు యాక్టివ్ గా, షార్ప్ గా ఉండాలంటే.. అన్ని పోషకాలు అవసరం. నాచురల్ ఫుడ్ ఎక్కువ పెడితే.. వాళ్ల తెలివితేటలు కూడా పెరగుతాయి. ఈరోజు మనం యాపిల్ డేట్స్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చూడ్డానికి యాట్రాక్టివ్ గా ఉండటంతో.. పిల్లలు ఇష్టంగా తింటారు.
యాపిల్ డేట్స్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
యాపిల్ ఒకటి
గింజ తీసినపండు ఖర్జూరం ముక్కలు అరకప్పు
క్యారెట్ తురుము అరకప్పు
కొబ్బరి తురుము అరకప్పు
వేపించిన వేరుశనగపప్పు అరకప్పు
ఆరెంజ్ జ్యూస్ టూ టెబుల్ స్పూన్స్
తేనె ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం…

ముందుగా యాపిల్ తీసుకుని తొక్కతీయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఖర్జూరం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక బౌల్ లో కమలా జ్యూస్ వేసి అందులో లెమన్ జ్యూస్, తేనె వేసి కలపండి. ఇంకో బౌల్ తీసుకుని అందులో కట్ చేసి యాపిల్ ముక్కలు, ఖర్జూరం ముక్కలు వేసి, ఇంతకుముందు చేసుకున్న తేనె, ఆరెంజ్ జ్యూస్ లిక్విడ్ కూడా వేయండి. వీటిని బాగా కలుపుకోండి. అందులోనే క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, వేరుశనగపప్పులు కూడా వేయండి. వీటిని బాగా కలపిస్తే.. యాపిల్ డేట్స్ సలాడ్ రెడీ.
తియ్యతియ్యగా పుల్లపుల్లగా సూపర్ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగనే.. ఇది చేసి పెడితే.. ఇష్టంగా తింటారు. వారానికి ఒకసారైనా ఇలాంటివి చేసి పెడుతుంటే.. బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. అయితే ఇది ఎప్పుడు తినాలో అప్పుడే చేసుకోవాలి. ముందే చేసుకుని ఒక గంటకో, రెండు గంటలకో తిందాం అంటే బాగుండదు.. ఫ్రష్ గా చేసుకుని హ్యాపీగా తినేయండి మరీ.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version