ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వరుసగా రెండో ఏడాది ఏపీ గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచంద్ వర్చువల్ గానే ప్రసగించారు. కరోనాతో పరిస్థితి ఏ విధంగా మారిందో మన అందరికి తెలుసనీ అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి నా సెల్యూట్ అంటూ కూడా గవర్నర్ కొనియాడారు. అదనంగా కోవిడ్ కేర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కోవిడ్ ని ఆరోగ్య శ్రీలో చేర్చామని ఆయన పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు. కరోనా రెండో వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య శ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్ లు కేటాయించామని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతుందని గవర్నర్ పేర్కొన్నారు.