ఆంధ్ర ప్రదేశ్ లో వరద ల కారణం గా మృతి చెందిన కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయిన వారికి కోటి రూపాయలిచ్చారు.. వరద ల తో మృతి చెందిన వారికి రూ. 50 లక్షలు ఇవ్వలేర అని చంద్ర బాబు అన్నారు.
ఇంట్లో బురద చెరితే నే కడుక్కోవాలంటే రూ. 2000 కంటే ఎక్కువ ఖర్చు అవుతాయని అన్నారు. కానీ జగన్ ప్రభుత్వం కేవలం రూ. 1000 ఇస్తానని అంటున్నాడని విమర్శించారు. ప్రజలు కష్టా ల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం స్పందించే పద్దతి ఇదేనా.. అని ప్రశ్నించాడు. అలాగే ఎన్ టి ఆర్ ట్రస్టు తరపున వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ. లక్ష ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాల ను ఆదు కోవాలని డిమాండ్ చేశారు. రాయలచెరువు పై ప్రమాదకరమైన సంకేతాలు వచ్చినా.. ప్రభుత్వం పట్టించు కోలేదని విమర్శించారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉందని అన్నారు.