నేరేడు పండు తినని వారికి.. ఆ వ్యాధుల భారిన పడాల్సిందేనా..!!

-

ఎండాకాలంలో మనకి దొరికేటువంటి పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. నేరేడు పండ్లు తినడానికి కాస్త వగరుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒకవేళ ఎవరైనా సరే ఈ నేరేడు పండును తినకుండా ఉంటే ఈ విషయాలు తెలిసిన తర్వాత కచ్చితంగా తినడం మొదలు పెడతారు. కాబట్టి వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.

నేరేడు పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. నేరేడు పండ్లు తినే వారు విటమిన్ -B,B-6 ,నియాసిన్ లు కూడా లభిస్తాయి. ఇక నేరేడులో కాల్షియంతో పాటు మెగ్నీషియం ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ రోగులకు ఇది ఒక చక్కటి ఔషధం లాంటిది. నేరేడు పండ్లను ప్రతిరోజూ తీసుకున్నట్లయితే రక్తంలో ఉండే షుగర్ స్థాయి కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇక మూత్ర సమస్యతో బాధపడేవారు నేరేడు పండు తినడం వల్ల అది అదుపులో ఉంటుంది. నేరేడు పండు లో ఫైబర్ ఎక్కువగా ఉండే వల్ల జీర్ణక్రియ బాగా చేయడానికి సహకరిస్తుంది.

మన చుట్టూ ఉండే వాతావరణం కాలుష్యం వల్ల సోకే రోగాల నుండి కూడా నేరేడును తినడం వలన రక్షిస్తాయి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావల్సినంత హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చు. నేరేడు పండు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఇందులో ఉండే పొటాషియం గుండె జబ్బులనుండి కాపాడడమే కాకుండా అధిక రక్తపోటు సమస్య నుండి కూడా కాపాడుతుంది.

ముఖ్యంగా చర్మం కాంతి వంతంగా ఉండాలంటే ప్రతిరోజు వీటిని ఖచ్చితంగా తినడం మంచిది. వీటిని తరచూ తింటూ ఉండడం వల్ల వృద్ధాప్య చాయలు కనిపించవు. దంతాల సమస్యలు నోటిలోని చిగుళ్ళు సమస్యతో బాధపడే వారు నేరేడు పండును తినడం చాలా మంచిది. ఈ నేరేడు పండు విత్తనాలు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి తగ్గించుకోవచ్చు. ఇలా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి నేరేడు పండు వల్ల..

Read more RELATED
Recommended to you

Latest news