కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని అన్నారు. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రసమయి బాలకిషన్. పాత్రికేయుల సాక్షిగా మరణ వాంగ్మూలం రాసిస్తానని అన్నారు.

కాంగ్రెస్ నేతల పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. ప్రస్తుతం రసమయి బాలకిషన్ చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా…. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్సలు బాగోలేదని తెలంగాణ ప్రజలు ఫైర్ అవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి పాలన.
జీవితంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు. ఒకవేళ వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండి.
పాత్రికేయుల సాక్షిగా మరణ వాంగ్మూలం రాసిస్తా – BRS మాజీ ఎమ్మెల్యే రసమయి pic.twitter.com/ownwOzZVIh
— greatandhra (@greatandhranews) July 9, 2025