మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి ఇమార్తి దేవిపై… ఆ రాష్ట్ర మాజీ సిఎం కమల్ నాథ్ లైంగిక వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కమల్ నాథ్ పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం విరుచుకుపడ్డారు. మహిళలను గౌరవించని చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ఆయన ఆరోపించారు. గ్వాలియర్ లో మాట్లాడుతూ కమల్ నాథ్ ఆమెను ఒక ఐటెం అని పిలిచారు.
దీనితో జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. “ఇది కాంగ్రెస్ సూత్రం. మొదట, దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ గురించి ఏదో చెప్పారు, అది నాకు గుర్తులేదు. ఇప్పుడు కమల్ నాథ్ బిజెపి మంత్రి ఇమర్తి దేవిని ‘ఐటమ్’ అని పిలిచారు అజయ్ సింగ్ ఆమెను ‘జలేబీ’ అని పిలిచారు. కాంగ్రెస్ ఎప్పుడూ మహిళలను గౌరవించదు.” అని మండిపడ్డారు. ఇక ఆయనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.