అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో… చంద్రబాబుకు అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని అంటూ లేఖలో కోరారు కేజ్రీవాల్.
బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు.. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదని లేఖలో పేర్కొన్నారు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు.. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారని వెల్లడించారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని లేఖలో పేర్కొన్న కేజ్రీవాల్… ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అటు నితీశ్‌కుమార్‌కు కూడా లేఖ రాశారు కేజ్రీవాఆల్.