అజిత్ సింగ్ 1939లో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (చికాగో)లో అజిత్ సింగ్ ఉన్నత విద్య చదువుకున్నారు. అమెరికాలో కంప్యూటర్ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పనిచేశారు. తన తండ్రి చరణ్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దేశానికి తిరిగి వచ్చారు. 1986లో అజిత్ సింగ్ రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. వీపీ సింగ్ క్యాబినెట్‌లో ఆయన కేంద్ర పరిశ్రమ మంత్రిగా పని చేశారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ ఆహార మంత్రిగా చేశారు. ఆ తర్వాత 1996లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం.. అజిత్ సింగ్ ఆర్‌ఎల్‌డీ పార్టీని ఏర్పాటు చేశారు. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. మే 2003 వరకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వంలో ఆర్ఎల్డీ భాగంగా ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అజిత్ సింగ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) లో చేరారు. అయితే గత సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి దూరమై బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
కేంద్రమాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో మృతి
-