బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

-

హుజురాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. బీజేపీ పార్టీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా తో హుజురాబాద్‌ నియోజక వర్గంలో బీజేపీ పార్టీ ఊహించని షాక్‌ తగిలింది.

బీజేపీ పార్టీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేర్చుకోవటాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి… తాజాగా బీజేపీ పార్టీ కి రాజీనామా చేశారు. ఈటల రాజేందర్‌ ను పార్టీలో చేర్చుకోవడం కారణంగా పెద్దిరెడ్డి రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా…మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌… ఇటీవలే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈటల రాజేందర్‌ పార్టీలో చేరినప్పటి నుంచి.. పార్టీ కార్యకలాపాలకు పెద్దిరెడ్డి దూరంగా ఉంటునే వస్తున్నారు. తాజాగా ఇవాళ ఏకంగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version