అధికారులు మా చెప్పులు మోయడానికే పనికొస్తారు :మాజీ కేంద్ర మంత్రి

రాజకీయనాయకులు అధికారులను చులకనగా చూడటం కొత్తేమీ కాదు. ఉన్నత చదువులు చదువుకుని వచ్చిన అధికారులకు కనీస గౌరవం ఇవ్వకుండా ఎలా పడితే అలా వాగుతుంటారు. తాజాగా బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తలో నిలిచారు. మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కాగా తాజాగా నాయకులు అధికారులు చెప్పినట్లు నడుచుకుంటున్నారా…కానీ కాదు.

అసలు వాళ్లకు పోస్టింగ్ లు జీతాలు ఇచ్చేది మేమే అని అన్నారు. అంతే కాకుండా ప్రమోషన్ లు, డిమోషన్ లు కూడా మా చేతుల్లోనే ఉంటాయని…వాళ్ళు కేవలం మా చెప్పులు మోయడానికి పనికి వస్తారని రాజకీయాల కు మేమే వాళ్ళను వాడుకుంటామని బహిరంగం గా ఉమాభారతి వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.