Prabhu Deva : ప్ర‌భుదేవా షాకింగ్ డిసిష‌న్..! ఇక అటువైపు వెళ్లను!

-

Prabhu Deva : ఇండ‌స్ట్రీలో వెర్స‌టైల్, మ‌ల్టీ టాలెంటెడ్ యాక్ట‌ర్స్‌ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక‌రు ప్ర‌భుదేవా. తొలుత ఇండ‌స్ట్రీలో కొరియోగ్రఫర్ గా అడుగుపెట్టిన ఆయ‌న.. అన‌తీ కాలంలోనే ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేశాడు. ప్రభుదేవా వ‌రుస విజ‌యాల‌తో టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అనంత‌రం చిన్నచిన్న‌ రోల్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. త‌రువాత ప‌లు చిత్రాల్లో హీరోగా కూడా న‌టించారు.

అంత‌టితో ఆగ‌కుండా.. ఆ సమయంలోనే డైరెక్ష‌న్ పై ఉన్న‌ ఆస‌క్తితో దర్శకుడిగా మారాడు. ప‌లు భాషల చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగులోనూ ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఆ తరువాత బాలీవుడ్ పై దృష్టి పెట్టారు. హిందీలో స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. వరుసగా సినిమాలు చేసి అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారాడు. హీరోలతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు.

అయితే ఈ మధ్య ప్రభుదేవా గ్రాఫ్ పడిపోయింది. తాను చేసినా చిత్రాలు అనుకున్న విజయాలు సాధించ‌లేకపోతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దీంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు ఆయ‌న‌. ఇకపై డైరెక్షన్ చేయకూడదని గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్న‌డంట‌. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని చెబుతున్నారు. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news