తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

0
33

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సతీమణితో పాటు ఇవాళ తిరుమల శ్రీవారిని విజయసాయిరెడ్డి దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించిన.. రాజ్యసభ మాజీ సభ్యులు… విజయ్ సాయి రెడ్డి కొత్త గెటప్ లో కనిపించారు. ఇక విజయసాయిరెడ్డి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు.

Former MP Vijayasai Reddy visits Tirumala temple

ఆయనకు శాలువా కప్పి…. సన్మానించారు. విఐపి కావడంతో ఆయనకు ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేశారు టిటిడి అధికారులు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇటీవల వైసిపి పార్టీకి… రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయ సాయి రెడ్డి రాజీనామా చేసిన అనంతరం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. కానీ ఏదో ఒక వార్త కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు విజయసాయి రెడ్డి.