నాలుగు వారాల్లో బరువు తగ్గాలంటే.. ఈ కొరియన్ డైట్ ను పాటించాల్సిందే..!

-

చాలా శాతం మంది బరువును తగ్గాలని కోరుకుంటారు కాకపోతే ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే బరువు తగ్గడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఎన్నో రకాల డైట్లను పాటించడం, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కాకపోతే సరైన ఫలితం లేకపోవడం వలన నిరాశ చెందుతారు. అయితే ఈ మధ్యకాలంలో కొరియన్ డైట్ ట్రెండ్ గా మారింది. ఈ డైట్ ను పాటించడం వలన బరువు తగ్గుతారు, పైగా కండరాలు కూడా బలంగా మారుతాయి. ఈ డైట్ పేరు స్విచ్ ఆన్ డైట్. ఈ డైట్ లో భాగంగా నాలుగు వారాలు పాటు మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రాం ను పాటించాలి. ఇలా చేయడం వలన శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది మరియు కండరాలు బలంగా ఉంటాయి.

ఈ డైట్ లో భాగంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. దీని వలన జీర్ణవ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉంటుంది. మొదటి వారంలో ప్రోటీన్ షేక్లు, ప్రోబయోటిక్స్ వంటివి తీసుకోవాలి. అదే వారంలో చివరి నాలుగు రోజులు గుడ్లు, పన్నీర్, టోఫు వంటివి తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన శరీరం కొవ్వు కరిగించే మోడ్ లోకి వస్తుంది. రెండో వారంలో అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకొని కొంత సమయం ఉపవాసం చేస్తూ ఉండాలి. ఆహారాన్ని తీసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించి, మిగిలిన సమయంలో ఉపవాసం చేయాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

మూడో వారంలో పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుని వారంలో రెండు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి. ఇలా చేయడం వలన శరీరంలో కొవ్వు కరుగుతుంది. చివరిగా నాలుగవ వారంలో మూడు రోజుల పాటు పూర్తిగా ఉపవాసం చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కరిగించే ప్రక్రియ మరింత తీవ్రంగా మారుతుంది. మిగిలిన రోజుల్లో అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన శరీరానికి శక్తి కూడా ఉంటుంది. అయితే ఈ డైట్ ను పాటిస్తున్నప్పుడు బియ్యం, కొవ్వు లేని ఉడికించిన మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్, పండ్లు వంటివి తీసుకోవచ్చు. కాకపోతే డైరీ ఉత్పత్తులు, కెఫైన్, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news