క్రిప్టోలో పెట్టుబడులు.. రూ.7.8 లక్షలు పోగొట్టుకున్న హన్మకొండ యువకుడు

-

సైబర్ మోసాలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కొందరు అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. జనాల అత్యాశను సైబర్ నేరస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పులపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి రూ.7.8 లక్షలు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకివెళితే..బీటెక్ విద్యార్థికి గత నెల 16న ఓ వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.స్థానికంగా ఉన్న హోటల్స్‌కు రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు.దీంతో అతను వారు చెప్పినట్లుగానే హోటల్స్‌కు రేటింగ్ ఇచ్చాడు.ఆ తర్వాత కొద్ది రోజులకు బీటెక్ విద్యార్థిని ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ చేయించి..వివిధ టాస్క్‌లు ఇచ్చి వాటిని పూర్తి చేయించారు.యువకుడికి వారిపై నమ్మకం రాగానే.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని నమ్మించారు మొదట రూ.1000 పెట్టుబడి పెట్టగా భారీగా లాభం వచ్చినట్లు సైబర్ నేరగాళ్లు చూపించారు. దీంతో అత్యాశకు పోయి క్రమక్రమంగా రూ.7,83,500 క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పోగొట్టుకున్నాడు.మోసపోయానని గమనించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

Read more RELATED
Recommended to you

Latest news