భారత్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంశలు

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై సుంకాలను తగ్గించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల సంవత్సరానికి 1 లక్ష కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు.

క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్(QUAD) దేశాల్లో భారతదేశం ఒకటి అని, అయినప్పటికీ భారత దేశం అమెరికా ఒత్తిడిని తట్టుకుని, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటు తో చమురును కొనుగోలు చేసిందని ప్రశంసించారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో పాకిస్థాన్ లో కూడా ఇటువంటి దాన్ని సాధించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ నేతృత్వంలోనే ప్రస్తుత ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ అరాచక స్థితిలో ఉందన్నారు. మీర్ జాఫర్లు,మీర్ సాధిక్ లు విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వాన్ని మార్చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version