నాగర్‌ కర్నూల్‌ మరో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు మరియు నిబంధనలు అమలు చేసినప్పటికీ ని…. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. నిర్లక్ష్యం మరియు ఓవర్ స్పీడ్ కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా… తెలంగాణ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా లో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది.

అయితే.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా … పదర మండలంలోని మద్దిమడుగు సమీపంలో దేవరకొండ డిపో బస్సును ఆటో ఢీ కొట్టింది. ఇక ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారి లో ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. ఇక మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను మిర్యాలగూడ సమీపంలోని సూర్యా తాండ వాసులుగా గుర్తించారు పోలీసులు..