ఏపీలో నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

-

అమరావతి: నలుగురు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, కన్నబాబు, అనిల్, సుచరిత, వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కాగా వారం క్రితం ఈ నలుగురిని సీఎం జగన్ ఎంపిక చేసి జాబితాను గవర్నర్‌కు పంపారు. ఆయన పరిశీలించి ఈ నలుగురిని ఆమోదించారు. దీంతో నలుగురు ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్ తాజాగా బాధ్యతలు చేపట్టారు. కాగా మరోవైపు ఎమ్మెల్యేలల కోటాలో 8 మంది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీల సయమం ముగిసింది. దీంతో ఈ పదవులను కూడా వైసీపీ భర్తీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news