చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మృతి

-

చీరల పంపిణీలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో న‌లుగురు మహిళ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరుప‌త్తూర్ జిల్లాలో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో తొక్కిస‌లాట జ‌రిగింది. తొక్కిస‌లాట‌లో న‌లుగురు మ‌హిళ‌లు మృతిచెంద‌గా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. తమిళనాడు తిరువత్తూరు జిల్లా వాణియంబాడి మురుగన్. ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ హిందూ ప్రజలు జరుపుకునే తైపూసం పండగ నేపథ్యంలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. స్థానికంగా ఉండే వందలాది మహిళలు ఈ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే టోకెన్ తీసుకోవాలని సంస్థ నిర్వాహకులు చెప్పడంతో మహిళలు అంతా పరుగెత్తారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇక అందులో చిక్కుకున్న నలుగురు మహిళలు ఊపిరాడక చనిపోగా, 10 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్పందించిన సంస్థ ప్రతినిధిలు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించి జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లుగా సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తైపూసం పండగపూట నలుగురు మహిళలు మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version