తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ ఈ ఏడాదే

-

తెలంగాణలో త్వరలోనే ఇంటింటికీ ఇంటర్నెట్ అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఫైబర్‌ ద్వారా ఈ ఏడాది పది లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతితో పురోగమిస్తోందని చెప్పారు. ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్యలో బెంగళూరును హైదరాబాద్‌ దాటడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.

గత రెండేండ్లలో ఐటీలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే కార్యాలయ స్థల వినియోగంలో బెంగళూరును దాటామని అన్నారు. దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 20% హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైప్‌ సెంటర్‌ టీవర్క్స్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ ఐటీ సాఫ్ట్‌వేర్‌ పారిశ్రామికవేత్తల సంఘం (హైసియా) హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌సిటీలో ఏర్పాటు చేసిన ఐటీ పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version