యాదాద్రి కొండ‌పైకి ఫ్రీ ఆర్టీసీ బ‌స్సులు.. ప్ర‌యివేటు వాహ‌నాలు బ్యాన్

-

యాదాద్రి దేవ‌స్థానానికి భ‌క్తుల‌కు అనుమ‌తి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే యాదాద్రి కొండ‌పైకి ప్రయివేటు వాహ‌నాల‌ను పూర్తిగా బ్యాన్ చేశారు. భ‌క్తుల‌ను యాదాద్రి కొండ‌పైకి ఆర్టీసీ బ‌స్సుల‌తో ఉచితంగా త‌ర‌లిస్తామ‌ని ఆల‌య ఈవో ప్ర‌క‌టించారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తుల తరలింపు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయం మొత్తం కూడా ఆలయమే భరిస్తుందని అన్నారు.

త్వరలో స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం కూడా జ‌రుగుతాయ‌ని తెలిపారు. అలాగే శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం కు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. అలాగే మొక్కు జోడు సేవలను కూడా ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. యాదాద్రి స్వామివారి నిత్య కైంకర్యాల స‌మ‌యాల‌ను దేవస్థానం ప్ర‌క‌టించింది. ఈ స‌మ‌యాలు ఇలా ఉన్నాయి.

ఉదయం 4నుంచి 4.30 వరకు సుప్రభాతం
ఉదయం 4.30 నుంచి 5 వరకు బిందె తీర్థం, ఆరాధన
ఉదయం 5 నుంచి 5.30 వరకు బాలభోగం
ఉదయం 5.30 నుంచి 6 వరకు పుష్పాలంకరణ సేవ
ఉదయం 6నుంచి 7.30 వరకు సర్వదర్శనం
ఉదయం 7.30 నుంచి 8.30 వరకు నిజాభిషేకం
ఉదయం 8.30 నుంచి 9 వరకు సహస్రనామార్చన
ఉదయం 9 నుంచి 10 వరకు బ్రేక్ దర్శనం
ఉదయం 10 నుంచి 11.45 వరకు సర్వదర్శనం
ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం

Read more RELATED
Recommended to you

Latest news