గుడ్ న్యూస్ : ఆ రాష్ట్ర విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు..!

-

పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ లో చదువుకుంటున్న విద్యార్థుల సమస్యలను పరిష్కారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. అయితే మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news