ఫ్రిడ్జ్ డోర్‌ రబ్బర్‌ మురికిగా అయిపోయిందా..? ఇలా చేస్తే క్లీన్ గా అయిపోతుంది..!

-

ఇంట్లో ఉన్న అన్ని వస్తువులని కూడా మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మురికిగా మారిపోతాయి. ఏదైనా వస్తువు మురికిగా మారిపోతే వాటిని ఉపయోగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక ఇన్ఫెక్షన్స్ దీని వలన సోకుతూ ఉంటాయి ఈరోజుల్లో అందరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్ లో మనం ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటూ ఉంటాము. అందుకని ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ ని శుభ్రంగా లేకపోతే వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఫ్రిడ్జ్ డోర్ కి రబ్బర్ ఉంటుంది కదా… అది త్వరగా మురికిగా మారిపోతుంది. మురికి పట్టిన రబ్బర్ని శుభ్రం చేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. మురికి పట్టిన రబ్బర్ని ఇలా శుభ్రం చేసుకోండి ఇలా కనుక మీరు ఫ్రిడ్జ్ ని క్లీన్ చేశారంటే ఈజీగా మురికి మొత్తం పోతుంది ఒకవేళ కనుక మీరు ఆ రబ్బర్ మీద ఉండే మురికిని అలానే వదిలేస్తే ఓ రకమైన వాసన దాని నుండి వస్తుంది రబ్బర్ని శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

రబ్బరు మురికిగా మారినట్లయితే టూత్ పేస్ట్ ని రాసి శుభ్రం చేయొచ్చు. అలానే ఒక గిన్నె లో ఒక గ్లాసు నీళ్లు వేసి ఐదు చుక్కల వెనిగర్ వేసి బాగా కలపండి. ఈ రబ్బర్ మీద స్ప్రే బాటిల్ లో ఈ నీటిని నింపి స్ప్రే చేయండి ఆ తర్వాత ఒక గుడ్డ పెట్టి తుడిచేస్తూ ఉండండి ఇలా చేస్తే మురికి మొత్తం పోతుంది. ఫ్రిడ్జ్ డోర్ తాలూకా రబ్బర్ మురికిగా మారితే మీరు నిమ్మ చెక్కతో రుద్దండి అప్పుడు కూడా మురికి మొత్తం మాయమైపోతుంది ఇలా సులభంగా మనం ఈ టిప్స్ తో ఫ్రిడ్జ్ రబ్బర్ని తెల్లగా మార్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news