తెలంగాణలో బీజేపీ పార్టీ చేతులెత్తేసిందని సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలకు సమాంతరంగా ఈనెల 14 నుండి 22 వరకు కేసీఆర్ పాలన పై రివర్స్ రన్ కార్యక్రమాలు చేయాలని మొదటగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. బండి సంజయ్‌ను ఢిల్లీ పిలిచి కేసీఆర్ మీద నెగిటివ్ ప్రచారాలు వద్దని వారించింది కేంద్ర బీజేపీ నాయకత్వం.
అంతేకాదు.. ఈ సందర్భంగా బండి సంజయ్ కు క్లాస్ కూడా పీకిందని సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరారు. బిజెపి అగ్రనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈటలకు బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రేపు లేదా ఎల్లుండి ఈ విషయమై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ పదవి లేదు. దీనిని కొత్తగా ప్రకటించి ఆ బాధ్యతలను ఈటలకు అప్పగిస్తారని సమాచారం.