ఫ్రైడ్ చికెన్’ నగరాల్లో ఉండే వాళ్ళు దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే అది తినోద్దని అంటున్నారు పరిశోధకులు. అనవసర సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఫ్రైడ్ చికెన్ చికెన్ తినే వారి మీద పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
ఫ్రైడ్ చికెన్ తినేవారికి టైప్–2 డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తమ పరిశోధనల్లో తేల్చారు. అది ఒక్కటే కాదు, ఫ్రైడ్ చికెన్ ఎక్కువగా తినేవారిలో ప్రమాదకరమైన కేన్సర్ లక్షణాలనూ గుర్తించారు పరిశోధకులు. ఫ్రైడ్ చికెనే ఒక్కటే కాదు, ఫ్రై చేసిన ఏ వస్తువులు తిన్నా ఈ సమస్యలు వస్తాయని పరిశోధకులు తమ పరిశోధనల్లో గుర్తించారు.
ఫ్రైడ్ ఫిష్, ఫ్రైడ్ మటన్, ఫ్రైడ్ చికెన్, మిగతా ఫ్రైడ్ ఐటెమ్స్ ఏది తిన్నా కూడా, యుక్త వయసులో ఉన్నవారికైనా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కానీ, నిత్యం ఇలా ఒక ఉద్యమం మాదిరిగా ఫ్రై చేసిన నాన్ వెజ్ తింటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే అని, నోటిని అదుపు చేసుకుంటే మంచిది అంటున్నారు.