దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెప్తున్న సంగతి తెలిసిందే. మే రెండో వారానికి కరోనా తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే మే రెండు మూడు వారాల్లో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తాజాగా ఒక సర్వే గుర్తించింది. వర్షా కాలం రాక ముందే దీన్ని అదుపు చేయడం కష్టం అని అంటున్నారు.
కరోనా తీవ్రత పెరగడం కంటే ఈ నెలలో మరణాలు ఎక్కువగా ఉండే అవకాశ౦ ఉంది అనే అంచనాలు ఇప్పుడు ఢిల్లీ కి చెందిన ఒక సర్వే సంస్థ వెల్లడించింది. దేశ ఆర్ధిక రాజధాని గా ఉన్న ముంబై నగరంలో మరణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడ రాబోయే రెండు వారాల్లో మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సర్వేలో చాలా మంది వైద్యుల నుంచి సమాచారం సేకరించారు.
ఇందులో సంచలన విషయాలు గుర్తించారు. యువకులు కూడా ముంబై లో మరణించే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రంలో కూడా మరణాలు ఎక్కువగా ఉంటాయని ఈ రాష్ట్రంలో మృతులు ఎక్కువగా చిన్న వయసు వారే ఉండే అవకాశం ఉందని తేల్చారు. దక్షినాది రాష్ట్రాల్లో కరోనా ముప్పు ఉత్తరాది కంటే ముందే తప్పుతుంది అని కూడా వెల్లడించారు.