ఇక నుంచి కెసిఆర్ ను తెలంగాణ సమాజం దొంగగా చూడాలి : రేవంత్‌ రెడ్డి

-

రైతులు బిజేపి, టీఆరెఎస్ లపై రైతులు కోపంగా వున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో.. ఈ రెండు పార్టీ లు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని నిప్పులు చెరిగారు. ఇద్దరి ఒప్పందం లో భాగంగానే.. బిజేపి నిరుద్యోగం అని కొత్త రాగం ఎంచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేస్తే… తెలంగాణ లో అరు లక్షల ఉద్యోగాలు వచ్చేయన్నారు. కెసిఆర్.. వరి వద్దు అని చెప్పి తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరి విత్తనాలు అమ్మితెనే కేసులు పెడతామన్న కలెక్టర్ కి కెసిఆర్ ప్రమోషన్ ఇచ్చాడని మండిపడ్డారు. కెసిఆర్ వరి విత్తనాల కోసం ఎందుకు సాగు చేస్తున్నాడని..కెసిఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎర్రవల్లి నిషేధిత ప్రాంతం కాదు.. అది పాకిస్తాన్ లో లేదన్నారు. దానికి పాస్ పోర్ట్ అవసరం లేదని.. మా నాయకులను గొర్రెలా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. అర్థరాత్రి నుండే అరెస్ట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రహస్యంగా ఒప్పందం కుదుర్చుకునే ఇలా వ్యవహరిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version