గ్రామసభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితా ఫైనల్ లిస్టు కాదని, అది కేవలం ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల జాబితా మాత్రమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు.
ఇదిలాఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ, వార్డు సభల్లో తమ పేర్లు లిస్టులో లేవని గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల గ్రామస్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన విజువల్స్ సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలతో ప్రజలు శాంతిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.