హైదరాబాద్ మహా నగరంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా చెలరేగాయి మంటలు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు.
దీంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది అగ్నిమాపక సిబ్బంది. అయితే… పక్కనే ఉన్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించగా పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నిజాంపేట్ ఫిట్నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం
స్టూడియో సమీపంలోని టిఫిన్స్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా చెలరేగిన మంటలు
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన స్థానికులు
ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక… pic.twitter.com/qyZJ6gHfos
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025