ఇంటి చిట్కాలతో చాలా సమస్యలు నయమైపోతాయి. మనం చిన్న చిన్న సమస్యలను ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఆకులు మూలికలు వంటివి మనకి చాలా సహాయం చేస్తాయి. గంగరావి బెరడు కషాయం బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది వివిధ రకాల సమస్యలని తరిమికొట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. ఔషధ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి ఇక మనం గంగరావి చెట్టు బెరడు వల్ల ఎలాంటి సమస్యలు దూరం అవుతాయి ఏ సమస్యలను పరిష్కరించుకోవచ్చు వంటి వాటిని చూద్దాం.
వాపులు తొలగిపోతాయి:
ఈ ఆకులని మెత్తగా దంచి దానిలో కొంచెం వంట ఆముదం వేసి గోరు వెచ్చగా వాపులు ఉన్న చోట రాస్తే ఖచ్చితంగా వాపులు తొలగిపోతాయి.
మూత్రంలో మంట:
మూత్రంలో మంట తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ పండ్ల లో వుండే గింజలను తీసుకుని చక్కెర కలిపి తింటే సమస్య తొలగిపోతుంది.
రక్త శుద్ధి అవుతుంది:
గంగరావి బెరడు ని చూర్ణం ని తీసుకుని కషాయం కాచి తేనె కలుపుకొని తీసుకుంటే రక్త శుద్ధి అవుతుంది.
చర్మ సమస్యలు:
గంగరావి చెట్టు ఆకులను తీసుకుని మెత్తగా నూరి లేపనంగా చేసి చర్మం పై రాస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.
చూశారు కదా చిన్న చిన్న సమస్యలను ఎలా గంగ రావి చెట్టు బెరడుతో తొలగించుకోవచ్చని మరి వీటిని ట్రై చేసి సమస్యల నుండి దూరంగా ఉండండి. అయితే వీటిని అనుసరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి .పెద్ద పెద్ద సమస్యలకి ఈ చిట్కాలు ని ట్రై చేస్తే డాక్టర్ సలహా తీసుకోండి.