నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో భ‌క్తుల ద‌ర్శ‌నానికి అనుమ‌తి..ఈ రూల్స్ పాటించాల్సిందే

-

నేటి నుంచి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ద‌ర్శ‌నానికి భ‌క్తుల కు అనుమ‌తి ఇవ్వనుంది ఆలయ కమిటీ. కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో టీకా స‌ర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది శ‌బ‌రిమ‌ల ఆల‌య కమిటీ. నేటి నుంచి రెండు నెల‌ల‌ పాటు అయ్య‌ప్ప ఆల‌యం తెరిచి ఉండ‌నుంది. కరోనా నిబంధనల ప్రకారం రోజుకు 30 వేల మందిని దర్శనం కోసం అనుమతి ఇవ్వనున్నారు. డి సెంబర్ 26న మండల పూజ ముగుస్తుంది.

మళ్లీ డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు. 2022జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. మళ్లీ అదేనెల 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే దర్శనానికి వెళ్లే వాళ్ళు తప్పకుండా తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. శబరిమల యాత్రలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ఇక పంపా నదిలో స్నానానికి అనుమతి ఉంటుంది కానీ బస చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news