లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా దక్షిణాది ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భారతీయుడు -2 . ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ ప్రారంభించారు. కాని ఎదో ఒక కారణం తో షూటింగ్ ను వాయిదా వేసుకుంటుంది. గతం లో ఒక సారి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫైర్ అక్సిడెంట్ జరిగి పలువురు మరణించారు. దీంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. దీని తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మరో సారి షూటింగ్ వాయిదా పడింది.
అలాగే ఈ సినిమా నిర్మాతాకు దర్శకుడి కి గొడవలు జరగడం.. హై కోర్టు వరకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆ గోడవలన్నీ కూడా సద్ధమణిగాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా తాజాగా షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కాజల్ అగర్వాల్ తప్పకున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై చిత్ర బృందం స్పందించలేదు. అలాగే ఈ సినిమా లో నటించిన వివేక్ కూడా మరణించడం తో కాజల్ పై మళ్లీ షూటింగ్ చేయాల్సి వస్తుందట. దీంతో కాజల్ స్థానంలో త్రిష ను తీసుకుని షూటింగ్ ను పూర్తి చేయాలని డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.