2024 లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు(మే 13) మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది.ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఇదిలా ఉంటే… రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది అని అన్నారు. 1400 కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉన్నారు. మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఇప్పటివరకు ఇలాంటి ఇబ్బందులు రాలేదని ఆయన వెల్లడించారు. ఈరోజు 400 ఫిర్యాదులు వచ్చాయి. 38 ఎఫ్ఎఆర్లు నమోదయ్యాయి’ అని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.