ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు: ముకేశ్ కుమార్

-

2024 లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు(మే 13) మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది.ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ చిన్నచిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ‘పోలింగ్ భారీగా జరిగింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పల్నాడు ఘటనలపై చర్యలు తీసుకున్నాం. పల్నాడులో 8 బూత్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. డేటా మొత్తం సేఫ్ గా ఉంది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు’ అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news