పారిశ్రామిక మౌలిక వ‌సతులకు నిధులు ఇవ్వండి : ఆర్థిక మంత్రి కేటీఆర్ లేఖ‌

-

తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక మౌలిక వ‌స‌తుల కోసం నిధులు కేటాయించాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వ‌చ్చే బ‌డ్జేట్ లోనే తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాల‌ని లేఖ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరారు. తెలంగాణ‌లో నేషన‌ల్ డిజైన్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌డానికి నిధులు కేటాయించాల‌ని కోరారు. నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ ఏర్పాటు అయిన త‌ర్వాత నిర్వ‌హాణ‌లో 25 శాతం రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించ‌డానికి సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇండ‌స్ట్రియ‌ల్ కారిడ‌ర్ ల‌కు కూడా నిధులు కేటాయించాల‌ని విజ్ఞాప్తి చేశారు.

3 రోడ్ల‌కు రూ. 6,000 వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని.. ఆ నిధులను ఇవ్వాల‌ని కోరారు. హైద‌రాబాద్ – బెంగళూర్ తో పాటు హైద‌రాబాద్ – విజ‌య‌వాడ ఇండస్ట్రియ‌ల్ కారిడ‌ర్ ల‌కు సంబంధించి కూడా రూ. 1,500 చొప్పున నిధులు కేటాయించాల‌ని కోరారు. అలాగే హైద‌రాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. నేష‌న‌ల్ ఇడ‌స్ట్రియ‌ల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు నిధులు కేటాయించాల‌ని లేఖ లో అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news