స్టేజ్ పైనే ఎన్టీఆర్ నడుము గిల్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బృందం.. ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే… ఆర్ ఆర్ ఆర్ టీం ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎన్ టి ఆర్, రామ్ చరణ్ కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ఎవరికీ కనపడకుండా… ఎన్టీఆర్ నడుము పై రాంచరణ్ గిల్లాడు. దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగాడు. రామ్ చరణ్ తనకు ఏమీ తెలియదని అన్నట్లుగా.. ఫేస్ పెట్టాడు. దీంతో అక్కడ ఫన్నీ మూమెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news