హైదరాబాద్ నగరం బాచుపల్లి నారాయణ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. బాచుపల్లి నారాయణ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మృతిరాలి బంధువులు నిరసనకు దిగారు. బాచుపల్లి నారాయణ కాలేజీ ముందు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు… నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష… నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు వెళ్ళిన అనూషను…. హాస్టల్లో వదిలేసి వెళ్లారు అనూష తల్లిదండ్రులు. ఒక్క రోజు గడువక ముందే… ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.