ఇకసెలవు.. బౌద్ధమత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలు

-

ప్రజా కవి, గాయకుడు గద్దర్ అంత్యక్రియలు బౌద్ధ మత పద్ధతుల్లో జరగనున్నాయి.ఈ మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో అల్వాల్ మహాబోధి స్కూలులో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గద్దర్ భౌతికకాయాన్ని హైదరాబాద్ ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌కు అంతిమయాత్రగా తరలించారు. గద్దర్ ఆదివారం మరణించడంతో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనాదర్ధం సోమవారం మధ్యాహ్నం వరకు ఎల్బీస్టేడియంలో ఉంచారు. ప్రజలకతీతంగా వేలాది మంది ప్రజలు గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. కాసేపట్లో జరగబోయే గద్దర్ అంత్యక్రియలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గద్దర్‌కు నివాళలర్పించనున్నారు.

ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ద నౌక గద్దర్‌ అంతిమ యాత్ర ప్రారంభమైంది. పోలీసులు గౌరవ వందనం..స్లో మార్చ్‌, డెత్‌ మార్చ్‌ లతో గన్‌ పార్క్‌ కు అంతిమ యాత్ర బయల్దేరింది. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ పార్థివ దేహాన్ని అమరవీరుల స్థూపానికి తీసుకెళ్లారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన భౌతికకాయానికి అభిమానులు నివాళులు ఆర్పించారు. ఈ అంతిమ యాత్రలో వేలాది మంది గద్దర్‌ అభిమానులు పాల్గొన్నారు. అల్వాల్ లోని ఇంటి వరకు గద్దర్‌ అంతిమ యాత్ర కొనసాగింది. అక్కడి నుంచి మహాబోధి మహా విద్యాలయంలో ఆయన దహన సంస్కారం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాబోధి స్కూల్‌ గ్రౌండ్‌ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version