తెలంగాణ రాజకీయాల్లో గెలుపోటములని శాసించే జిల్లాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి రావడం ఖాయమే. గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాలో బిఆర్‌ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంది. గత ఎన్నిల్కల్లో 14కి 13 సీట్లు బిఆర్‌ఎస్ గెలుచుకుంటే. ఒక కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలిచింది.
కానీ తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో బిఆర్‌ఎస్ సంపూర్తిగా పాలమూరుపై పట్టు సాధించింది. అయితే ఈ సారి జిల్లాలో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఎందుకంటే గతంలో ఇది కాంగ్రెస్ కంచుకోట. పైగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అలాగే ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. అందుకే గతంలో కాంగ్రెస్ హవా నడిచేది. కానీ రెడ్డి వర్గం బిఆర్‌ఎస్ వైపుకు వెళ్లింది. దీంతో బిఆర్‌ఎస్ హవా నడుస్తోంది.
ఇక ఈ సారి మాత్రం బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇచ్చేలా ఉంది. తాజా సర్వేలో కూడా అదే తేలింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ చూస్తే..ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కాంగ్రెస్, బిజేపి పోటీ ఇస్తున్నాయి. కాకపోతే ఓట్ల చీలికతో మంత్రి మళ్ళీ గట్టెక్కే ఛాన్స్ ఉంది. సేమ్ నారాయణపేటలో కూడా బిజేపి, కాంగ్రెస్‌ల మధ్య ఓట్లు చీలి బిఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వేలో తేలింది.
కోడంగల్ లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమే అని తేలింది. జడ్చర్లలో బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. దేవర్‌కద్రలో కాంగ్రెస్‌కు లీడ్ ఉందట. మక్తల్‌లో బిఆర్‌ఎస్‌కు గెలుపు ఛాన్స్ ఉంది. వనపర్తిలో బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు..స్వల్ప లీడ్ కాంగ్రెస్‌కు ఉంది. గద్వాల్‌లో బిఆర్‌ఎస్- బిజేపి-కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుందని తేలింది.
ఆలమూరులో బిఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉందని తేలింది. అచ్చంపేటలో బిఆర్‌ఎస్‌కు స్వల్ప లీడ్ కనిపిస్తుంది. కల్వకుర్తిలో బిఆర్‌ఎస్-బిజేపి-కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. షాద్‌నగర్ లో బిఆర్‌ఎస్‌కు లీడ్. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌కు లీడ్ కనిపిస్తోంది.