నగరి ఎమ్మెల్యే ఎమోషనల్ పోస్టు వైరల్ !

-

 

నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఎమోషనల్ పోస్టు పెట్టారు. నాన్నకు ప్రేమాతో అంటూ ఎమోషనల్ పోస్టును ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. అసెంబ్లీ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఇచ్చిన ఐడి కార్టుతో తన తండ్రి, దివంగత నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ,మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని గుర్తు చేసుకున్నారు భాను ప్రకాష్. నాన్నా.. నువ్వు పంచిన విలువలతో, నగరి ప్రజల దీవెనలతో పవిత్రమైన శాసనసభలో అడుగు పెట్టాను.. మీ ఆశయాలు నెరవేర్చడానికి శాసనసభలో అడుగు పెట్టిన నాకు ఈ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు నాకు వెంటనే మీ కార్డు గుర్తుకు వచ్చిందన్నారు.

Gali Bhanu Prakash emotional post

అన్నగారి పిలుపుతో లెక్చరర్ పోస్టు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది మొదలు.. నీ తుది శ్వాస వరకు ఈ కార్డే కదా నీ చిరునామా. నిన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలు పిలిస్తే చాలు.. అర్ధరాత్రి సమయంలో అయినా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయేవాడివి. అప్పుడు ఎన్నోసార్లు ఈ కార్డు నీ దగ్గర ఉంది కాబట్టి ఇలా వెళ్లాలి ఏమో అనుకునేవాడిని. దీని విలువ తెలియక చిన్నప్పుడు చాలాసార్లు నీ మీద చిన్నబుచ్చుకునే వాడిని. కానీ నిన్న నా చేతులతో ఈ కార్డును అసెంబ్లీలో అందుకుంటున్నప్పుడు దీని విలువ తొలిసారి తెలిసింది. ఇది కేవలం గుర్తింపు కార్డు కాదు కొండంత బాధ్యత అని. నిన్ను నమ్మి ఓటేసిన ఏ ఓటరు ఇబ్బంది పడకూడదని నీకు అనుక్షణం గుర్తు చేసింది ఈ కార్డే అని తెలిపారు గాలి భాను ప్రకాష్.

Read more RELATED
Recommended to you

Latest news