లోకేష్ పై గల్లా ఫిర్యాదు…? నా జోలికి రావొద్దు…!

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా ఆలోచనలో పడిపోయింది. సమర్ధవంతమైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యువ నాయకుల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. అయితే లోకేష్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని కొందరు సమర్ధిస్తున్నారు మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు చంద్రబాబు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా లోకేష్ కి ఉన్న ఇగో ప్రాబ్లం పార్టీని బాగా ఇబ్బంది పెడుతుంది. తాజాగా గల్లా జయదేవ్ విషయంలో ఆయన తన ఇగో ని బాగా చూపించారు. గతంలో గల్లా జయదేవ్ విషయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కాస్త చికాకు పెట్టారు. గల్లా విషయంలో అనవసరం రాజకీయం అంతా చేసారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కేసినేని నానీ గల్లాకు సర్దిచెప్పడం తో పరిస్థితి చల్ల బడింది.

ఇప్పుడు మళ్ళీ లోకేష్ గల్లా దగ్గర కాస్త చికాకు రాజకీయం చేసారు, ఇటీవల పార్టీలో ఉన్న యువ నేతలు అందరితో ఆయన ఒక లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేసారు. ఈ లంచ్ మీటింగ్ లో లోకేష్ గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువనేతలతో కొన్ని వ్యాఖ్యలు చేసారు. నేను మంగళగిరి లోనే ఉంటున్నాను. ఏదైనా సమస్య ఉంటే నా వద్దకు రండి అన్నట్టు చెప్పారట నారా లోకేష్.

ఇది పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. యువనేతలు కూడా గల్లాను చూసి జాలి పడ్డారు. పాపం గల్లా జయదేవ్ ఏమో గుంటూరు ఎంపీ కాబట్టి అన్ని నియోజకవర్గాల సమస్యలను ఆయన దగ్గర ఉండి చూస్తున్నారు. కాని లోకేష్ ఇలా అనేసరికి గల్లా షాక్ అయ్యారు. వెంటనే నన్ను కార్నర్ చేస్తే మాత్రం నేను పార్టీ మారడానికి అయినా సరే సిద్దంగానే ఉంటాను అన్నట్టు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version