అదొక్క విషయం లో తేడా కొడితే .. జగన్ కి బ్యాండ్ బాజా మొగిపోద్ది..!!

-

వైయస్ జగన్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడెప్పుడా వస్తుందా..? అని కాచుకు కూర్చున్నారు ప్రతి పక్ష పార్టీలకు చెందిన నాయకులు. ఇంగ్లీష్ మీడియం విషయంలో అదే విధంగా ఇసుక విషయంలో ప్రజలనుండి వ్యతిరేకత తీసుకురావాలని ఎంతగానో ట్రై చేసిన పెద్దగా లాభం చేకూరలేదు. అటువంటి సమయంలో వైయస్ జగన్ సొంతంగా తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాని అడ్డం పెట్టుకుని చంద్రబాబు వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని భావించిన అది టీడీపీకే మైనస్ అయ్యింది. ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వీటిలో గాని కొద్దిగా వైసీపీ కి తేడా పడితే మాత్రం జగన్ కి బ్యాండ్ బాజా మొగిపోద్ది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ మాత్రం ఫలితాలు తారుమారైన టీడీపీకి అండగా ఉండే మీడియా వర్గం దీన్ని బేస్ గా చేసుకుని రాష్ట్రంలో వైసీపీ పార్టీపై వ్యతిరేకత కచ్చితంగా  తీసుకు రావడం జరుగుతుందని పేర్కొంటున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ కూడా డబ్బులు పంచ కూడదు మరియు మద్యం పంచ కూడదు అంటూ జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రజల నుండి సరైన తీర్పు వస్తుంది, ఏ మాత్రం రిజల్ట్ తేడా కొట్టిన జగన్ గవర్నమెంట్ మొత్తానికి ఫ్యూజ్ ఎగిరిపోవడం ఖాయం అని చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version