టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ ..?

-

ప్రపంచ కప్ జూన్ లో ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాలం ముగియనున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ ఎవరనే విషయంపై క్రికెట్ అభిమానులలో ఆసక్తి నెలకొంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ కి సంబంధించి కేకేఆర్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ తో బీసీసీఐ సెక్రటరీ జైషా సుదీర్ఘంగా చర్చించినట్లు జరిపినట్టు క్రిక్ బజ్ నివేదిక వెల్లడించింది.గంభీర్ దాదాపు టీమిండియా హెడ్ కోచ్ గా రాబోతున్నట్టు.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు 3 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీలు రావడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2012, 2014 కేకేఆర్ కు కెప్టెన్ గా టైటిల్స్ అందించిన గంభీర్.. ఇటీవలే ముగిసిన సీజన్ లో మెంటార్ గా జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. అంతకముందు 2021, 2022 సీజన్ లలో లక్నో మెంటార్ గా వ్యవహరించిన గంభీర్.. 2 సీజన్ ల పాటు జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఈ కారణంగానే గంభీర్ పై బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news