తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇవి చర్చనీయంశంగా మారాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడు సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అప్పట్లో ఆ రాజీనామా ని ఆమోదించకుండా హోల్డ్ చేసిన స్పీకర్. తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదిస్తూ రాజీనామా లేఖ మీద స్టాంప్ వేశారు ఈ నేపథ్యం లో రాజీనామని ఆమోదించడంపై స్పందించిన గంట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని అన్నారు నేను రాజీనామా చేసినప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతుగా నిలిచి ఉన్నట్లయితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమై ఉండేదని అన్నారు. అయితే అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని ప్రయివేటీకరణ ని వ్యతిరేకిస్తూ తాను చేసిన రాజీనామా ని మూడేళ్లు భద్రంగా కోల్డ్ స్టోర్ లో దాచి ఇప్పుడు ఆమోదించారు అంటే ఇది కచ్చితంగా రాజకీయ కుట్రని అన్నారు