గాంధీ ఆస్పత్రి కేసులో బిగ్ ట్విస్ట్ : మహిళలదే డ్రామా అని తేల్చిన పోలీసులు

-

గాంధీ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల లోనూ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును తాజాగా హైదరాబాద్ పోలీసులు చేధించారు. ఈ కేసులో మహిళలదే హైడ్రామా అని పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ…గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటన పై టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ , షీ టీమ్స్ పూర్తి స్థాయి విచారణ చేశామన్నారు. 800 గంటల సిసి ఫుటేజ్ ను పరిశీలించి, 200 మంది పైగా విచారణ చేశామని తెలిపారు. ఈ కేసు సున్నితమైన కేసు , కానీ ఎక్కడ కూడా బాధితురాలు పై గ్యాంగ్ రేప్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

గాంధీ ఆస్పత్రి నుండి ఆమె స్వయంగా వెళ్లిపోయారని…సిసి కెమెరాల్లో గుర్తించి నారాయనగూడా పోలీస్ లిమిట్స్ లో ఆ మహిళను గుర్తించామన్నారు. మొదటగా ఫిర్యాదు చేసిన మహిళ పోలీసులను తప్పుదోవ పట్టించిందన్నారు. టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగానే ఈ కేసును ఛేదించామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీ ఆస్పత్రి టెక్నీషియన్ ఉమ మహేశ్వర్ ప్రమేయం లేదని..మా పరువు ఏమవుతుందో అనే భయం తో ఒకటికి రెండు తప్పులు చేశారన్నారు. బాధితురాలు ని బలవంతంగా ఎవరు కూడా తీసుకొని వెళ్ళలేదని విచారణ లో తేలిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news